దేశ రాజధానిలో నెలకొన్న నీటి ఎద్దడిపై ఢిల్లీ మంత్రి అతిషి నిరవధిక నిరాహార దీక్షను శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ హర్యానా ప్రభుత్వం ఢిల్లీకి తగిన నీటిని అందించడం లేదు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలంటే సత్యాగ్రహ మార్గాన్ని అనుసరించాలని మహాత్మా గాంధీ బోధించారని నేటి నుంచి జల సత్యాగ్రహం ప్రారంభిస్తానని ఆమె అన్నారు. ఉదయం 11 గంటలకు రాజ్‌ఘాట్‌కు వెళ్లి గాంధీజీకి నివాళులర్పించారు. మధ్యాహ్నం నుంచి భోగల్, జంగ్‌పురాలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తానన్నారు. ఢిల్లీ ప్రజలకు హర్యానా నుంచి సరైన నీటి వాటా వచ్చే వరకు నేను నిరాహార దీక్ష కొనసాగిస్తానని అతిషి ఎక్స్ లో రాశారు.
ఢిల్లీ నీటి సంక్షోభం పై నిరాహార ధీక్ష చేయనున్న అతిషి…

