నైరుతి ఢిల్లీలోని ద్వారక వీధుల్లో సూపర్‌హీరోలు స్పైడర్‌మ్యాన్, స్పైడర్-ఉమెన్ వంటి దుస్తులు ధరించి మోటార్‌సైకిల్‌పై విన్యాసాలు చేయడం ద్వారా ఎక్కువ మంది అనుచరులను సంపాదించడానికి ఇన్స్టాగ్రామ్ రీల్‌ను ప్రత్యేకమైన పద్ధతిలో చిత్రీకరించాలనే క్రేజ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ జంటను ఇబ్బందుల్లో పడేసింది. వీరిద్దరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అది చూసిన పోలీసులు అద్దాలు, నంబర్ ప్లేట్ లేని బైక్‌పై ప్రయాణించడం సహా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడమేనని ఇద్దరు సృష్టికర్తలను శుక్రవారం ఢీల్లీ పోలీసులు అరెస్టు చేశారు. స్పైడర్‌మ్యాన్ జంట కూడా హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతూ కనిపించారని ఢిల్లీ పోలీసులు వివరించినలో తెలిపారు. వారిని ఆదిత్య, అతని స్నేహితురాళు అంజలి గా గుర్తించినట్లు వారు తెలిపారు. వీరిద్దరూ స్పైడర్‌మ్యాన్ నజాఫ్‌గఢ్ పార్ట్ 5 పేరుతో బైక్‌పై వెళుతున్నట్లు ఇన్స్టాగ్రామ్ రీల్‌ను రికార్డ్ చేశారని వెళ్ళడించారు.
ఢిల్లీలో స్పైడర్‌మ్యాన్, స్పైడర్వుమన్ అరెస్ట్… అసలేం జరిగిందంటే…
