Viral

ఢిల్లీలో పేద ప్రజల పరిస్థితులపై ధ్వజమత్తిన ఎల్‌.జీ. …

AA1m9t0h

ఈశాన్య ఢిల్లీలోని షహదారాలోని ఒక కాలనీలో ప్రజలు నివసిస్తున్న దుర్భర పరిస్థితులపై లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా బుధవారం ధ్వజమెత్తారు. ఇతర ప్రాంతాలలో ఇలాంటి సమస్యలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దృష్టికి తీసుకెళ్లిన ఒక రోజు తర్వాత ఈ సమస్యలు బయట పడ్డాయి. సక్సేనా మైక్రోబ్లాగింగ్ సైట్ Xలో షహదారాలోని కలందర్ కాలనీని సందర్శించిన చిత్రాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ… ప్రజలు “దయనీయమైన పరిస్థితులలో” జీవిస్తున్నారని చెప్పారు.

ఏ.ఏ.పీ. ప్రభుత్వం నుంచి తక్షణ స్పందన లభించలేదన్నారు. మంగళవారం ఎల్‌.జీ. పదవిపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందిస్తూ… రాజ్యాంగబద్ధమైన పదవిని కలిగి ఉన్నప్పటికీ సక్సేనా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు అని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించడం తన రాజ్యాంగ కర్తవ్యమని, సి.ఎం. సానుకూలతను చూపుతారనే ఆశాభావాన్ని ఎల్‌.జి. కేజ్రీవాల్‌తో అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.