ఢిల్లీలో బుధవారం భారీ వర్షం నమోదయ్యింది. మయూర్ విహార్ మూడు గంటల్లో 119 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఐ.ఎం.డీ. వెళ్లడించింది. నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి మరియు ఆగస్టు 1న అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు నగర ప్రభుత్వం ప్రకటించింది. నగరంలో సాయంత్రం 5:30 నుండి 8:30 గంటల మధ్య 79.2 మిమీ వర్షపాతం నమోదైంద. ఐ.ఎం.డీ. తెలిపింది. నేషనల్ ఫ్లాష్ ఫ్లడ్ గైడెన్స్ బులెటిన్లో ఢిల్లీని కూడా ‘ఆందోళన కలిగించే ప్రాంతాల’ జాబితాలో చేర్చినట్లు వాతావరణ కార్యాలయం తెలిపింది.
ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షంతో స్తంభించిన ట్రాఫిక్…

