మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 14 మందికి పెద్దాపురం కోర్టు ఒక్కొక్కరికి రూ. 40 వేలు వంతున జరిమానా విధించిందని జగ్గంపేట సీఐ లక్ష్మణరావు తెలిపారు. గత నవంబర్లో జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి పోలీసులు 14 మంది మీద కేసులు నమోదు చేశామన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా 14 మందికి జరిమానా, ఒక వ్యక్తికి రెండు రోజులు జైలు శిక్ష విధించారని చెప్పారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 14 మందికి జరిమానా విదించిన కోర్టు…

