జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న పోరాటం 28వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా డీ.ఎం.ఈ. నీ శానిటేషన్ వర్కర్ల, నాయకత్వం, సి.ఐ.టి.యు. నాయకత్వం కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, శానిటేషన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సి.హెచ్. విజయ్ కుమార్, మాట్లాడుతూ… కృష్ణ కన్స్ట్రక్షన్స్ అనే కాంట్రాక్టర్ కార్మికులకు న్యాయపరంగా చట్ట ప్రకారంగా ఇవ్వవలసిన పి.ఎఫ్. ను కట్ చేసి యజమాని ఇవ్వటం లేదని అన్నారు.
దీనిపై అధికారులు కలగజేసుకుని పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. చట్ట ప్రకారం యజమాని వాట యజమాని, కార్మికుల వాటా కార్మికుల జీతం నుంచి కట్ చేసి పి.ఎఫ్. ఖాతాకు జమ చేయాలని కానీ ఇక్కడ మాత్రం చట్టవిరుద్ధంగా కటింగ్ జరుగుతుందని అన్నారు. ఈ విషయంపై అధికారులు కలగజేసుకుని పరిష్కారానికి కృషి చేయాలని కార్మికులకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, వివిఎస్ కుమార్, రవిబాబు, శేషుబాబు, లక్ష్మీ ప్రియ, తదితరులు పాల్గొన్నారు.

