జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ మోస్ట్ ఔట్ స్టాండింగ్ లేడీ (సీనియర్ మెంబర్ అసోసియేషన్) అవార్డు విన్నర్ గా తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి నగరానికి చెందిన ప్రముఖ వైద్యురాలు, శ్రీలత ఆసుపత్రి అధినేత, జాతీయ బీ.సీ. సంక్షేమ సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలు, డాక్టర్ అనుసూరి పద్మలత నిలిచారు. విజయవాడలో జరిగిన జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ అలుమినీ సమావేశంలో ఈ అవార్డును డాక్టర్ పద్మలత అందుకున్నారు. ఈ సందర్బంగా ఆమెను ఘనంగా సత్కరించి అవార్డును అందచేశారు. కార్యక్రమంలో జే.సీ.ఐ. అలుమినీ నేషనల్ చైర్మన్ అన్భాజగన్, ప్రమోద్ కుమార్, డా. మురళీ మోహన్, జి.వి.ఎల్. అప్పాజీ, జి.ఎల్. మనోహర్, మానుకొండ శ్రీనివాసరావు, రాహుల్, కృష్ణ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
డా. పద్మలతకు సీనియర్ మెంబర్ అసోసియేషన్ అవార్డ్…
