2016లో కుల వివక్షపై దేశవ్యాప్త ఉద్యమాన్ని రేకెత్తించిన హైదరాబాద్ విశ్వవిద్యాలయం డాక్టరల్ విద్యార్థి రోహిత్ వేముల దళితుడు కాదని, తన అసలు కుల గుర్తింపు బయటపడుతుందనే భయంతో తాను నిరాశతో చనిపోయాడని తెలంగాణ పోలీసులు తెలిపారు. ఇందుకు సంభందించి విచారణ ముగిసినట్లు శుక్రవారం హైకోర్టు ప్రకటించింది. అయితే 60 పేజీల మూసివేత నివేదిక వివాదానికి దారితీసింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కోసం కోర్టు అనుమతిని కోరుతుందని రాష్ట్ర పోలీసులు అర్థరాత్రి ప్రకటించారు.
అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ సి.హెచ్. శ్రీకాంత్ సంతకం చేసిన ఈ నివేదికలో అప్పటి వైస్ ఛాన్సలర్ అప్పారావు పొదిలే, అప్పటి సికింద్రాబాద్ ఎం.పి. బండారు దత్తాత్రేయ, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్, బీ.జే.పీ., అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌కు చెందిన నాయకుల నుండి చాలా మంది నిందితులను కూడా తొలగించారని తెలిపారు.

