Political

టీ.డీ.పీ. లోకి చేరిన వై.సీ.పీ. నాయకులు…!!!

WhatsApp Image 2024-02-12 at 7.57.27 PM (1)

కాకినాడ నగరంలో జగన్నాధపురం 20 వ డివిజన్ కు సంబందించిన వై.సీ.పీ. నాయకులు ఆకుల దుర్గాప్రసాద్ (జాన్ వెస్లీ) తన అనుచర వర్గం 200 మందితో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు వారికి పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. కొండబాబు మాట్లాడుతూ… గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే, జగన్‌ రెడ్డి తన అరాచకాన్ని విధ్వంసాన్ని అభివృద్ధి చేసుకున్నాడని అన్నారు.

చంద్రబాబు సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే జగన్‌ నాలుగేళ్లున్నర తన పాలనలో రాష్ట్రంలో అలజడలు సృష్టిస్తున్నాడన్నారు. వై.సీ.పీ. పాలనలో అన్ని వర్గాల ప్రజలు మహిళలపై దాడులు అధికమయ్యాయని, స్వర్ణాంధ్రగా కీర్తి గడించిన ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్ రెడ్డి గంజాయి కేంద్రంగా మార్చేసాడన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, కొల్లిబోయిన శ్రీనివాస్, వనపత్రి బద్రి, డివిజన్ నాయకులు గొరుసు వెంకట దుర్గారావు, బి.సీ. సెల్ అధ్యక్షులు ఒమ్మి బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.