తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ యువగలం పాద యాత్ర చేపట్టినప్పటి నుంచి ప్రజల్లో బాగా చేరువయ్యి ప్రజా ధారణ బాగా పెరింగింది. అందుకు నిదర్శనంగా రోజు రోజుకు టీ.డీ.పీ పార్టీలోకి యువకులు, వేరే పార్టీ నాయకులు చేరుతున్నారు.
ప్రస్తుతం కాకునాడ జిల్లాకు చెందిన పిఠాపుర పట్టణంలో 1 మరియు 30 వార్డుల నుంచి బీ.జే.పీ. నుండి బోడపాటి అనురాధ కనకరాజు మిత్రబృందం, అంబేడ్కర్ యూత్ నుంచి 80 మంది ఈ పార్టీలోకి చేరారు. వర్మ వారందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో తెలుగు దేశం మరియు జనసేన కలిసి అధికారంలోకి రావాలని దానికి అందరూ కృషి చేయాలని అన్నారు.

