కాకినాడలో టి.డి.ఆర్. బాండ్లు భూ కొనుగోళ్లకు వినియోగించరాదని, కేవలం రోడ్ల వెడల్పు చేయటం కాలువల నిర్మాణం కారణంగా భూములు కోల్పోయిన వారికి మాత్రమే ఈ టి.డి.ఆర్. బాండ్లను వినియోగించాలని భారతీయ జనతా పార్టీ పేర్కొంది. ఈ సందర్బంగా బీ.జే.పీ. నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ గృహంలో పత్రిక ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేసారు.
ఈ సమావేశంలో మీడియా ప్యానలిస్ట్ దువ్వూరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ. టి.డి.ఆర్. బాండ్లను మొట్టమొదటిగా మహారాష్ట్ర ప్రభుత్వం బొంబాయిలో ఉపయోగించిందని, తరువాత ఇది ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విడుదల చేస్తున్నాయన్నారు. టి.డి.ఆర్. బాండ్ల కుంభకోణంపై గవర్నర్ ను కలిసేందుకు పార్టీ రాష్ట్ర గవర్నర్ అపాయింట్మెంట్ కోరనున్నదని వెల్లడించారు.
ఈ టి.డి.ఆర్. బాండ్లను రాష్ట్రంలో ఎక్కడైనా అమ్మే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కొందరు నాయకులు ఈ టి.డి.ఆర్. బాండ్లను విశాఖ వంటి ఇతర నగరాల్లో అమ్ముతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని తెలియజేశారు. ఈ టి.డి.ఆర్. బాండ్లు కొనుగోలు విషయమై ప్రజలు బిల్డర్లు అప్రమత్తంగా ఉండాలని, బి.జె.పి. నాయకులు హెచ్చరించారు.

