Political

టిడ్కో పెండింగ్‌ రుణాలను తక్షణమే మంజూరు చేయాలి… బ్యాంకర్ల తో కమిషనర్‌ నాగనరసింహారావు

WhatsApp Image 2023-10-20 at 6.11.05 AM

టిడ్కో ఇళ్ళకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రుణాలను వెంటనే మంజూరు చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ సీ.హెచ్‌. నాగ నరసింహారావు బ్యాంకర్లను కోరారు. తన ఛాంబర్‌లో బ్యాంకర్లు, నగరపాలక సంస్థ అధికారులు, మెప్మా సిబ్బంది, సీవోలతో టిడ్కో ఇళ్ళ ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ… తొలివిడత 1152 టిడ్కో ఇళ్ళకు గాను ఇంకా 144 ఇళ్ళకు 25 శాతం రుణాలు మంజూరు కావల్సి ఉందన్నారు. ఆయా బ్యాంకర్లు దీనిపై చొరవ తీసుకుని నూరుశాతం రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ మేరకు మెప్మా సిబ్బంది ప్రత్యేక పర్యవేక్షణ చేసి ఈ నెల 25వ తేదీలోపుగా రుణ ప్రక్రియ పూర్తి అయ్యేలా చూడాలని, సాంకేతిక పరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అలాగే టిడ్కో ద్వారా పెండింగ్‌లో ఉన్న 304 మంది లబ్థిదారులకు సంబంధించిన మార్ట్‌గేజ్‌ ప్రక్రియను కూడా వేగంగా పూర్తిచేయాలని సూచించారు. సమావేశంలో లీడ్‌ డిస్ట్రిక్ట్‌మేనేజర్‌ ప్రసాద్, మెప్మా ఏ.వో. శివప్రసాద్, టీ.పీ.ఆర్.వో. మానే కృష్ణమోహన్, మెప్మా సిటీ మిషన్‌ మేనేజర్‌ వెంకట్రాజు, ఆయా బ్యాంకర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.