మత్స్యకారుల మనసు గెలిచిన నాయకుడు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని, ఆయన పొరపాటున జారవిడిచిన మాటను కాపీ కట్ పేస్టులు ద్వారా అతికించి మత్స్యకారుల ముందు దోషిగా నిలబెట్టాలి అనుకునే కుట్రదారుల కుతంత్రాలను కాకినాడ నగర మత్స్యకారులు గ్రహించి ఎమ్మెల్యే ద్వారంపూడి కి అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ నారాయణరావు పేర్కొన్నారు.
స్థానిక వైకాపా సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి, అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తూ మత్స్యకార్లకు సమాజంలో సముచితమైన పదవులు, గౌరవ స్థానం కల్పించిన ఘనత కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. దురదృష్టవశాత్తు ఎమ్మెల్యే ద్వారంపూడి మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై వ్యాఖ్య చేస్తూ చిన్న మాట నోరు జారిందని దానిని తక్షణం సవరించు కోవడం కూడా జరిగిందన్నారు.

