జార్ఖండ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. స్తానిక జమ్హారా-కర్మతాండ్లోని కల్హరియా దగ్గర రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా పెద్ద సంఖ్యలో ప్రయానికులకు తీవ్ర గాయలు అయ్యాయు. సమాచారం అందడంతో రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి హుటాహుటీన చేరుకున్నారు. ఆంగ్ ఎక్స్ ప్రేస్ రైల్లో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న ప్రయాణికులు రైలు నుంచి దూకడంతో బెంగళూరు – భాగల్పూర్ ఎక్స్ప్రెస్ రైలు వారిపై నుంచి వెళ్లిందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని తెలిపారు.
జార్ఖండ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం…
