జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో మార్చి 14వ తేదీ అనగా గురువారం ఉదయం 10:00 గంటలకు జూబ్లీహిల్స్ జనసేన పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ మరియు వేడుకల కార్యక్రమం ఉంటుందని నాయకులు తెలిపారు. కావున తెలంగాణ జనసేన పార్టీలో వివిధ పదవులలో ఉన్న నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అందరూ ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొనాలని రాష్ట్ర నాయకత్వం తరఫున కోరారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలంగాణలోని జిల్లాలలో మరియు గ్రేటర్ హైదరాబాద్ లో మీ యొక్క నియోజకవర్గంలోని డివిజన్లలో, మండలాలలో గ్రామాలలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ వేడుకలు జరపాలని రాష్ట్ర నాయకత్వం తరఫున కోరారు.
జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలకు సర్వంసిద్ధం…

