ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ గెలుపు కోసం క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ వెళ్ళి ఎన్నికల ప్రచారం చేసినమే 13న జరిగిన ఎన్నికల్ల విజయానికి కృషి చేసిన జనసేన వీర మహిళల సేవలు మరువలేనివని జనసేన అధినేత పవన్ కళ్యాన్ అన్నారు. ముందుగా మహిళల్లో రాజకీయ చైతన్యం వస్తేనే సమాజంలో మార్పు వస్తుందని జనసేన బలంగా నమ్మే సిద్ధాంతమని అన్నారు. అందుకే పోరాటానికి ప్రతిరూపమైన వీర నారీ ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో వీర మహిళ విభాగం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి మండుటెండను లెక్కచేయకుండా పిఠాపురంలో నా తరపున ఆడపడుచులు చేసిన ప్రచారం, అందించిన తోడ్పాటుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ప్రతీ ఒక్కరినీ గుర్తించే భాద్యత జనసేన తీసుకుంటుందని ఆయన అన్నారు.
జనసేన వీర మహిళల సేవలు మరువలేనిది… -పవన్ కళ్యాన్-

