జనసేన తోనే దివ్యాంగులు అభివృద్ధికి సాధ్యం..
కాకినాడలోని సిద్ధార్థ నగర్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో దివ్యాంగులతో కలిసి శశిధర్ విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ ద్వారానే దివ్యాంగుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని జనసేన పార్టీ కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్తా శశిధర్ అన్నారు. అలాగే దివ్యాంగుల అభివృద్ధికి అడ్డుగా ఉన్న నిబంధనలను ఎత్తివేయాలని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ… కాకినాడ నగరంలో ఉన్న ఏటిమొగ ప్రాంతంలో సుమారు 200 మందికి పైగా దివ్యాంగులు ఉన్నారని వీరికి పథకాలు అందటం లేదన్నారు. గతంలో పెళ్ళికానుకకు సంబంధించి నేరుగా మనీ ఆర్డర్ ఇంటికి వచ్చేదని ప్రస్తుతం పలు నిబంధన వల్ల అవి దివ్యాంగులకు అందటం లేదన్నారు. వీరి అభివృద్ధి కోసం రుణాలను అందించి ఆదుకోవాలని సూచించారు. అలాగే వీరికి కాకినాడ సిటీలోనే ఇళ్ళు ఇచ్చేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు.

