ఈ నెల 28వ తేదీన జనసేన తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం దగ్గర నిర్వహించే భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభను విజయవంతంగా నిర్వహించేందుకు ఆరు కమిటీలను నియమించారని జనసేన అధ్యక్షులకు రాజకీయకార్యదర్శి పి.హరిప్రసాద్ వెళ్లడించారు.
1) లాజిస్టిక్స్ కమిటీ:
పంతం నానాజీ, షేక్ రియాజ్, వై.శ్రీనివాస్, చన్నమల్ల చంద్రశేఖర్, అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్ లను నియమించారు.
2)రవాణా, పార్కింగ్ కమిటీ:
తాతంశెట్టి నాగేంద్ర, వాసిరెడ్డి శివప్రసాద్, మైఫోర్స్ మహేశ్, అడ్డాల నాగేశ్వర రావు, గర్భాన సత్తిబాబు, గల్లా తిమోతి, వికృతి శ్రీనివాస్, బోనం నాగేశ్వర్ లను నియమించినట్లు తెలిపారు.
3)మీడియా కమిటీ:
కరాటం సాయి, నల్లగోపుల చలపతి, బొలియాశెట్టి శ్రీకాంత్, సందు పవన్, గరికపాటి శివ శంకర్, ఎ.పోలేశ్వర మూర్తి, ఆళ్ళ హరి లను నియమించారని తెలిపారు.
4)మెడికల్ కమిటీ:
డా.బొడ్డేపల్లి రఘు, డా.పి.గౌతమ్, డా.చుండూరి మల్లీశ్వరి, డా.ఎం.కోటేశ్వర రావు, డా.ఎన్.బావాజీ, డా. రాపాక రమేశ్, డా. పిల్లా శ్రీధర్ లను నియమించారని ఆయన అన్నారు.
5)వాలంటీర్స్ కమిటీ:
బోడపాటి శివదత్, బి.శ్రీనివాస్ పట్నాయక్, సాకే పవన్ కుమార్, ఎ.విక్రమ్, అజయ్ వర్మ, కర్ణ కుమార్ లను నియమించారు.
6)క్యాటరింగ్ & హాస్పిటాలిటీ కమిటీ:
కత్తిపూడి బాబీ, మోకా నాని, రావాడ నాగు, కె.రామారావు, మేడిద దుర్గాప్రసాద్, ఎస్.పట్టాభిరామయ్య, మాగాపు వీర్రాజు, మెండా శివప్రసాద్ లను నియమించారని వెళ్లడించారు.

