జనసేన, టీ.డీ.పీ. పార్టీల నాయకులు వై.సీ.పీ. లోకి చేరారు. సామర్లకోట మండలం వీకే రాయపురం గ్రామంలో జనసేన, టీ.డీ.పీ. పార్టీ నాయకులు సుమారు 100 వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీ లోకి చేరారు. ఈ సందర్భంగా సీనియర్ వై.సీ.పీ. నాయకుడు తలారి దొరబాబు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దొరబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలను వేసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనకు ఆకర్షితులై అనేకమంది పార్టీలోకి చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అయ్యాక కార్పొరేషన్ చైర్మన్ ఆవాల రాజేశ్వరి, ఎం.పి.పి. బాపురెడ్డి సత్తిబాబు, గ్రామ సర్పంచ్ మార్త పూర్ణిమ, తదితరులు పాల్గొన్నారు.

