అసమానతలు లేని భారతదేశ రూపకల్పనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారధ్యంలో భారత రాజ్యాంగాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. 26 నవంబరున రాజ్యాంగాన్ని అప్పటి భారత ప్రభుత్వం ఆమోదించడంతో ప్రతి ఏటా దేశవ్యాప్తంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా వేడుకలు నిర్వహించుకుంటున్నామని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు ముత్తా శశిధర్ అన్నారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జనసేన జై భీమ్ యాత్ర 30వ రోజుకు చేరడంతో స్థానిక నాయకులతో కలిసి కాకినాడ రేచర్లపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, పిఠాపురం మహారాజా, మహాత్మా గాంధీ విగ్రహాలు వద్ద భారత రాజ్యాంగ ఆవశ్యకతను జనసేన పార్టీ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు రాజ్యాంగంలోని పలు అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంటరానితనం, అస్పృశ్యత నివారణ కోసం బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలు నేటితరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. అనంతరం రామకృష్ణారావుపేట 33వ డివిజన్ కామేశ్వరి నగర్ కమ్యూనిటీ హాల్ సమీపంలో జనసేన పార్టీ జెండా స్తూపం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణ, నగర ప్రధాన కార్యదర్శి ఆట్ల సత్యనారాయణ, ఆకుల శ్రీనివాస్ పలువురు జనసేన పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

