మాజీ మంత్రి, దివంగత వట్టి వసంతకుమార్ కుటుంబానికి చెందిన వట్టి పవన్ కుమార్ ను గురువారం మంగళగిరిలో ఉన్న జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కండువా వేసీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పవన్ కుమార్ తో పాటు ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన మాజీ డీ.సీ.సీ.బీ. చైర్మన్ మైలవరపు గోపాలకృష్ణ, మాజీ జెడ్పీటీసీ కాటి కిరణ్ అలాగే వై.సీ.పీ. సీనియర్ నాయకులు మంద శ్రీనివాసరెడ్డి, తదితర నాయకులు జనసేనలో చేరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్ధుల విజయానికి కృషి చేయాలని కోరారు.
జనసేనలోకి చేరిన వట్టి పవన్ కుమార్…

