జగ్గంపేట నియోజకవర్గంలో వై.సీ.పీ. కి భారీ షక్ తగిలింది. ఆ నియోజకవర్గం నుంచి 100 మందికి పైగా వై.సీ.పీ. నాయకులు, మాజీ ఎం.పీ.టీ.సీ. లు, సొసైటీ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు ఆ పార్టీ ని వీడి స్వచ్చందంగా జనసేనలో పార్టీలో చేరారు. అక్కడి ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో చేబ్రోలు పార్టీ కార్యాలయంలో నాగబాబు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వై.సీ.పీ. దుర్మార్గాలు భరించలేక ఆ పార్టీని వీడి జనసేనలో చేరుతున్నట్లు వారు వివరించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. మరి కొన్ని రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడనున్నదని, కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ ప్రయోజనకరమైన పరిపాలన ఉంటుందని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో మెడబోయిన గోవిందరాజు, మెడబోయిన శ్రీను, అంకం గంగాశంకర్, తలటం సూరిబాబు, యండ్ర శ్రీను, తదితరులు ఉన్నారు.
జగ్గంపేటలో జనసేనలో భారీగా చేరికలు…

