అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను కాకినాడ జిల్లాలో జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా విచ్చేసారు. తొలత ఆయన అమరజీవి పొట్టి శ్రీరాములు, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం అక్కడకు విచ్చేసిన వారికి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరువలేనిదని అన్నారు. ఈ కార్య్రమానికి ఆర్యవైశ్య సేవా సంఘం వాసులు, సంఘం అధ్యక్షలు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
జగ్గంపేటలో ఘనంగా పొట్టి శ్రీరాముల జయంతి కార్యక్రమం…

