Political

జగన్ రెడ్డిని ఓడించెందుకు జనం సిద్ధం…

OIP (4)

అవినీతి, అరాచకం, దోపిడీ, విధ్వంసంతో కూడిన పాలన చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఓటర్ వెరిఫికేషన్, భవిష్యత్తు గ్యారెంటీ, మై టిడిపి, తదితర అంశాలపై కాకినాడ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందు ఆదివారం క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్లకు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి కొండబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…వైసిపి ప్రభుత్వ పాలన వల్ల రాష్ట్రం ఎంతో నష్టపోయిందని, వైసిపి పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత నేడు ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జగన్ అసమర్థత పాలన వల్ల రాష్ట్ర అప్పులు పెరిగి వాటికి వడ్డీలు బారీగా పెరిగి ఆ భారం ప్రజలపై పడిందని తెలిపారు. నిత్యవసర వస్తువుల ధరలు, ఇంటి పన్నులు, విద్యుత్ చార్జీలు, బస్ చార్జీలు 5 రెట్లు పెంచీ… చెత్త పన్నులు లాంటివి వేసి రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీల్చిస్తున్నాడని అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.