Political

జగన్ పాలనలో ఒక్కరు కూడా ఆనందంగా లేరు… -రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు-

WhatsApp Image 2023-11-07 at 7.14.10 PM
 రాష్ట్రంలో జగన్ పాలనలో ఒక్కరు కూడా ఆనందంగా లేరని, అన్ని ధరలు పెరిగిపోయాయని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం బడుగువానిలంకలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మెర్ల గోపాలస్వామి, క్లస్టర్ ఇన్చార్జ్, జిల్లా రైతు అధికార ప్రతినిధి ఈదల సత్తిబాబు ఆధ్వర్యంలో జరిగిన బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ మహా శక్తి చైతన్య రథయాత్ర కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బండారు పాల్గొన్నారు. నాయకులు, మహిళలతో కలిసి బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాలుఇంటింటికి వెళ్లి “భవిష్యత్తుకు గ్యారెంటీ మినీ మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి జరగబోయే లబ్ధిని వివరించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రజలను కోరారు. 
చంద్రబాబుకు ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో ఆయన రాజమండ్రి జైలు నుండి విజయవాడ వెళ్లే సమయంలో ప్రజల నీరాజనాళాలు చూస్తే అర్థమవుతుందని అందుకే వై.సీ.పీ. లో వెన్నులో వణుకు మొదలైందని అన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్కరికి అయినా ఉద్యోగం వచ్చిందా ఒక్క డిఎస్సి వచ్చిందా అని ప్రశ్నించారు. అందుకే జాబు రావాలి అంటే బాబు రావాలి అంటున్నారని, రాష్ట్రంలో ప్రజల కష్టాలు అలోచించి సూపర్ సిక్స్ అనే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ప్రకటించిందని అన్నారు.  ఈ కార్యక్రమంలో తెలియజేసిన పార్టీ అగ్ర నేతలు పాల్గొన్నారు.
Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.