సామర్లకోట మున్సిపల్ చైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి కుటుంభాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప సోమవారం పరామర్శించారు. రెండు రోజుల క్రితం చైర్ పర్సన్ అరుణ మామాగారైన గంగిరెడ్డి స్వామి నాయుడు మృతి చెందగా పట్టణ వై.సీ.పీ. నాయకులు గంగిరెడ్డి కృష్ణమూర్తి, ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ గంగిరెడ్డి బాలరామ్, గంగిరెడ్డి వెంకన్నల తండ్రి అయిన స్వామి నాయుడు మృతికి ఎమ్మెల్యే రాజప్ప వారి కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని తెలిపారు. స్వామి నాయుడు చిత్రపటం వద్ద ఆయన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు , బడుగు శ్రీకాంత్, బలుసు వాసు, తాతపూడి అరుణవంశి, నిమ్మకాయ కిరణ్,తదితరులు పాల్గొన్నారు.
చైర్ పర్సన్ కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ…

