చేయూత స్వచ్ఛంద సేవాసంస్థ సమాజానికి అందిస్తున్న సేవా కార్యక్రమాలతో ఎంతో మంది లబ్ది పొందుతున్నారు. ఆ సంస్థకు తన వంతు సహకారాన్ని అందించాలన్న ఆశయంతో సోల్మేట్స్ వ్యవస్థాపకులు, రోటరి గోల్డెన్ జూబ్లి క్లబ్ పూర్వాధ్యక్షులు బి. అజయ్ రెడ్డి యాభైవేల రూపాయల చెక్కును బ్రదర్ షఫీ ద్వారా చేయూత వ్యవస్థాపకులు రవికి అందజేసారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ… సోల్మేట్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను తాము నిర్వహిస్తున్నామని తెలిపారు.
అయితే మూడు సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా భోజన సదుపాయాన్ని చేయూత సంస్థ ద్వారా అందజేయడం వంటి సేవ చాలా గొప్పని, అభినందనీయమని అన్నారు. దీనితో పాటు స్వచ్ఛంద రక్తదాన శిబిరం, విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునే కార్యక్రమాన్ని తాము గమనించామని అన్నారు. చేయూతకు భవిష్యత్లో మరిన్ని సహకారాలను అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ వైడి రామారావుతో పాటు పలువురు పాల్గొన్నారు.

