Political

చేనేత ఉత్పత్తుల పట్ల ప్రజలలో అవగాహన కల్నించాలి… జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా

WhatsApp Image 2023-10-20 at 8.32.39 PM

జిల్లాల్లో చేనేత ఉత్పత్తుల పట్ల ప్రజలలో అవగాహన కల్పించేందుకు 5 రోజుల పాటు హ్యాండ్ లూమ్ ఎక్స్ పో ను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఖాదీ మహోత్సవ్ లో భాగంగా కాకినాడ దేవాలయం వీధి పైడా చలమయ్య శ్రీనివాస కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ…. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నెల 02 నుంచి 31 వరకు ఖాదీ మహోత్సవ్ పేరుతో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేనేత ఉత్పత్తుల ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈ నేపథ్యంలో చేనేత ఉత్పత్తులకు విస్తృత ప్రచారం ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం భారత ప్రభుత్వం చేనేత శాఖ ఆధ్వర్యంలో కాకినాడ పట్టణంలో ఐదు రోజులపాటు హ్యాండ్లూమ్ ఎక్స్ పో ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ హ్యాండ్లూమ్ ఎక్స్ పో కార్యక్రమంలో చేనేత కార్మికులు, హస్త కళాకారులు, ఖాదీ సొసైటీలు తయారుచేసిన వస్తువులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా అమ్ముకునేందుకు వీలుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. హ్యాండ్లూమ్ ఎక్స్ పో కార్యక్రమంలో 27స్టాళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో 23స్టాళ్లు హ్యాండ్లూమ్ ఉత్పత్తులకు కేటాయించగా రెండు స్టాళ్ళు హ్యాండీ క్రాఫ్ట్స్ కు రెండు స్టాళ్లు ఖాదీ ఉత్పత్తులకు కేటాయించారన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.