చెన్నై లో ఘోర ప్రమాధం చోటుచేసుకుంది. ఉత్తర చెన్నైలోని ఎన్నూర్ ప్రాంతంలోని ఎరువుల కర్మాగారంలో అమ్మోనియా గ్యాస్ లీక్ అవ్వడంతో దాదాపు 50 మంది ఆసుపత్రి పాలైనట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటణలో ఎన్నూర్‌కు చెందిన వంద మందికి పైగా వ్యాధి బారిన పడ్డారని, దాదాపు 50 మంది ఆసుపత్రి చేరారని తమిళనాడు ఆరోగ్య మంత్రి ఎం. సుబ్రమణియన్ తెలిపారు. ప్రస్తుతం వారందరికీ ఎటువంటి ప్రమాదంలేదని ఆయన వెళ్లడించారు.
ఆయన మాట్లాడుతూ… అక్కడ సమీపంలో ఉన్న పైపు లైన్‌లో నుంచి గ్యాస్ బుడగలు రావడంతో అర్ధరాత్రి అక్కడి ప్రజలు అప్రమత్తమై ప్రభుత్వ అధికారులు తెలిపారన్నారు. అదే సమయంలో ఆయా గ్రామాలకు చెందిన స్థానికులు దుర్వాసన రావడంతో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారని అయన చెప్పారు.
చెన్నైలోని గ్యాస్ లీక్… 50 మంది ఆసుపత్రిలో చేరిక..
