క్యాన్సర్ తో బాదపడుతున్న చిన్నారి కోరికను బంజారా హిల్స్ పోలీసులు నెరవేర్చారు. గుంటూరు కి చెందిన అనుపోజు బ్రహ్మం, తల్లీ లక్ష్మి దంపతుల కి చెందిన రెండవ కుమారుడు మోహన్ సాయి సంవత్సర కాలంగా క్యాన్సర్ తో బంజారా హిల్స్ లోని ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు. చిన్నారికి పోలీసు అధికారి కావాలన్న కోరికను తల్లి దండ్రుల ద్వారా తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది మెక్ ఏ ఫౌండేషన్ సభ్యులకు తెలిపారు. మెక్ ఏ ఫౌండేషన్ సభ్యులు చిన్నారిని బంజారా హిల్స్ పోలిస్ స్టేషన్ కు తీసుకు వెళ్లి అతని కోర్కె గురించి తెలియజేశారు. దీంతో అక్కడి సిబ్బంది చిన్నారి నీ ఆహ్వానించి పోలీస్ అధికారి గా సీట్ లో కూర్చోబెట్టి అతని కోర్కె ను తీర్చారు. అనంతరం చిన్నారికి సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్ ఇతర సిబ్బంది బహుమతులను అందజేశారు.

