చిత్తడి నేల సంరక్షణ పై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్, పాఠశాల విద్యాశాఖ, అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీన చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరుగుతుందని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖాధికారిణి జి. నాగమణి తెలిపారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆవరణలో గోడ పత్రికను ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… చిత్తడి నేలపై అవగాహన కల్పించడానికి విద్యార్థుల చేత చిత్ర లేఖన పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో అన్ని యాజమన్య పాఠశాలలలో చదువుతున్న 6 నుండి 10వ తరగతి చదువుచున్న విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన వచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఉప విద్యాశాఖాధికారి జే.డేనియల్ రాజు, పిఠాపురం ఉప విద్యాశాఖాధికారిణి దాట్ల సుభద్ర, మండల విద్యాశాఖాధికారులు సి.హెచ్.రవి, తదితరులు పాల్గొన్నారు.

