కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అగ్నికుల క్షత్రియ జాతి గురించి అవమానకరంగా మాట్లాడడాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీ.సీ. సెల్ కార్యదర్శి అండ్రాజు శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం మట్టగుంట గ్రామంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాకినాడ సిటీలో 45 వేల పైబడి అగ్నికుల క్షత్రియ ఓటర్లతో మద్దతుతో గెలిచి అదే సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడడం దారుణమని అన్నారు.
అలాగే గతంలో కూడా ప్రతిపక్ష నాయకుల మీద భౌతిక దాడులు చేయించి అక్రమ కేసులు పెట్టించిన ఘనత చంద్రశేఖర్ రెడ్డి అని గుర్తిచేసారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని క్షమాపణ చెప్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అగ్నికుల క్షత్రియ సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నామని లేనిపక్షంలో పార్టీ నుంచి బహిష్కరించాలని అన్నారు. లేకపోతే ఈ రాష్ట్రంలో 45 నియోజకవర్గాల్లో బలంగా ఉన్న అగ్నికుల క్షత్రియులు అంతా ఏకతాటిపై వచ్చి వై.సీ.పీ. ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
