News Political

చంద్రబాబునాయుడికి మధ్యంతర బెయిల్‌ మంజూరు

  • 1న తిరుపతి దైవదర్శనానికి వెళ్లనున్న చంద్రబాబు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో గత 50 రోజులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి హైకోర్టు మధ్యంతర బెయిల్‌ ను మంగళవారం జారీ చేసింది. చంద్రబాబునాయుడు అరెస్టు అయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో ప్రత్యేక షరుతులపై ఇంటి వద్దనే చికిత్స పొందేందుకు కోర్టు ఈ బెయిల్‌ మంజూరు చేసింది. పార్టీ సమావేశాల్లో పాల్గొనరాదని, నాయకులతో మంతనాలు, చర్చలు జరపరాదనే షరుతులపై ఆయన విడుదల కానున్నారు. ఇంటి నుంచి ఎక్కడికి వెళ్లరాదని, వ్యక్తిగత వైద్యునితో చికిత్స పొందవచ్చని, ఆయనకున్న జడ్‌ ప్లస్‌ కేటగిరి కొనసాగించవచ్చని కోర్టు షరుతులు విదించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపద్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆనందం వెల్లువిరిసింది. బాణాసంచాతో, వాయిద్యాలతో వీదుల్లో సంభరాలు చేసుకున్నారు. రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదలై రాత్రి 9.20 గంటలకు తాడేపల్లి చేరుకోనున్నారు. మరుసతి రోజు బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం దైవదర్శనానికి వెళ్లనున్నట్టు సమాచారం.

Avatar

Spy News

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.