కుట్రలను నమ్ముకున్న జగన్ మోహన్ రెడ్డికి న్యాయం, ధర్మాన్ని నమ్ముకున్న చంద్రబాబుకి మధ్య యుధ్దం జరుగుతోందని, ప్రజా క్షేత్రంలో ప్రజలే తమ ఓటుతో జగన్ మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యుడు వనమాడి వెంకటేశ్వర రావు (కొండబాబు) పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ బాబుకు తోడుగా ఒక నియంతపై పోరాటంలో మేము సైతం కార్యక్రమంలో భాగంగా కొండబాబు 10 వ డివిజన్ లో పర్యటించి బాబుతో నేను అనే పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ… చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభవృద్ధిలో, పెట్టుబడుల ఆకర్షణలో, ఉపాధి కల్పనలో అగ్రస్థానంలో ఉండేదనీ, జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత అక్రమ కేసులు, అరెస్టులు తప్ప అభివృద్ధి శూన్యమని, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్ష కోట్లు దోచుకున్న అవినీతి చరిత్ర జగన్ మోహన్ రెడ్డిది, అలాంటి అవినీతి పరుడు చంద్రబాబు పై అవినీతి, ఆరోపణలు చేసి అరెస్టు చేయడం ముమ్మాటికీ కక్ష సాధింపేనని కొండబాబు అన్నారు.
చంద్రబాబుకు తోడుగా టీడీపీ ఇంటింటి ప్రచారం…. -మాజీ శాసనసభ్యుడు వనమాడి వెంకటేశ్వర రావు

