ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్లమ్‌డాగ్ మిలియనీర్ లోని గ్రామీ అవార్డ్ విన్నింగ్ పాట జై హో ను రూపొందించిన గాయకుడు సుఖ్‌విందర్ సింగ్ అని, మ్యూజిక్ మాస్ట్రో ఏ.ఆర్. రెహమాన్ కాదని చెప్పి వివాదాన్ని సృష్టించాడు. ఇప్పుడు జనాదరణ పొంది అవార్డు గెలుచుకున్న పాటను పాడిన గాయకుడు సుఖ్‌విందర్ సింగ్ అటువంటి వాదనలన్నింటినీ ఖండించారు. అతను మాట్లాడుతూ… తాను పాటను మాత్రమే పాడానని వాస్తవానికి ఇది రెహమాన్ మాత్రమే స్వరపరిచాడని చెప్పాడు.
ఏ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన పాటను నేను మాత్రమే పాడాను. రామ్ గోపాల్ వర్మ జీ కోయి ఛోటీ హస్తీ తో నహీ హైం, షాయద్ ఉన్హే కుఛ్ గలత్ పాట చలా హోగా. గుల్జార్ సాహెబ్ రాసిన ఈ పాట రెహమాన్‌కి నచ్చింది. ఆ తర్వాత ముంబైలోని జుహులో ఉన్న నా స్టూడియోలో కంపోజ్ చేశాడు. సుభాష్‌ని వినేలా చేశాడు. అప్పటి వరకు నేను పాట పాడలేదు అని అతను సైట్‌తో చెప్పాడు.

