పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం గ్రామంలో అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో వాలంటీర్లకు సత్కార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమో మాట్లాడుతూ… సీ.ఎం. జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్లను నియమించి ప్రజల దగ్గరకే పాలన అన్న మాటను నిలబెట్టుకున్న వ్యక్తి జగన్ అన్నారు. అనతంరం ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ప్రదానం చేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల ధికారులు, నాయకులు, గ్రామ, వార్డు సచివాలయాల కోఆర్డినేటర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు.
గోపాలపురం గ్రామంలో ఘనంగా వాలంటీర్లకు సత్కారం…

