ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024 అవార్డ్ ప్రదర్శన వేడుకలను నటీనటులు అపర్ శక్తి ఖురానా, కరిష్మా ఆధ్వర్యంలో గుజరాత్‌లో అద్భుతంగా నిర్వహించారు. ఈ అవార్డ్స్ కార్యక్రమంలో విక్కీ కౌశల్, మేఘనా గుల్జార్‌ల చిత్రం సామ్ బహదూర్ మూడు అవార్డులను కైవసం చేసుకోవడం ద్వారా 69వ ఎడిషన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల విజేతల మొదటి బ్యాచ్ లో నిలిచారు.
సామ్ బహదూర్ మూడు ముఖ్యమైన విభాగాల్లో విజయాలు సాధించి సాంకేతిక అవార్డులలో ఆధిపత్యం సాదించాడు. ఈ చిత్రం ఉత్తమ సౌండ్ డిజైన్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ మరియు బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డులను సొంతం చేసుకుంది. రణబీర్ కపూర్ మరియు చిత్రనిర్మాత సందీప్ రెడ్డి వంగాల చిత్రం, యానిమల్ కూడా రెండు అవార్డులను కైవసం చేసుకోవడం ద్వారా ముద్ర వేసింది.

