గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని ఒక గేమింగ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం పెద్ద అగ్నిప్రమాదం జరిగింది. రాజ్‌కోట్‌లోని ఒక గేమింగ్ జోన్ వద్ద జరిగిన ఫైర్ విషాదంలో మరణించిన వారి సంఖ్య ఇందులో 14 మంది పిల్లలతో సహా 28 కి చేరుకుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంభందించి రాజ్‌కోట్ గేమ్ జోన్ మేనేజర్ నితిన్ జైన్, గేమ్ జోన్ భాగస్వామి యువరాజ్ సింగ్ సోలంకిని పోలీసులు అరెస్టు చేశారు. రాజ్‌కోట్ పోలీసు కమిషనర్, రాజు భార్గవ ఈ విషయంపై అప్‌డేట్ ని పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ… పోలీసు చర్యలు జరుగుతున్నాయి. ట్రాపి గేమ్ జోన్ యజమాని, మేనేజర్‌ను విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారని చెప్పారు. గత రాత్రి పరిశోధనలు ప్రారంభమైన ఫైర్ విషాదాన్ని పరిశీలించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పడిందని అన్నారు.
గుజరాత్‌లో అగ్ని ప్రమాదంపై విచారణకు సీ.ఐ.టీ. బృందం…
