ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక ఏటుకూరు సమీపంలో లోడుతో ఉన్న ట్రాక్టర్ కారు ఢీ కొట్టుకున్నాయి. ఆ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని ప్రభుత్ర ఆసుపత్రికి తరలించారు. కంకర లోడుతో వేళుతండగా కారు గుద్దడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతు చేందినవారు మంగళగిరికి చేందిన వారుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పిడుగురాళ్ల మండలం, జూలకల్లులో పెళ్ళికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. జరిగిన ఘటన పై పోలీసులు కేసునమోదు చేసారు.
గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం… ముగ్గురు మృతి…
