గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో నంది నాటకోత్సవ వేడుకలు నిర్యహిస్తున్నారు. 1200 మంది నాటక రంగ కళాకారులు ఈ పోటీల కోసం వివిధ రాష్ట్రాల నుంచి హాజరయ్యారు. ఈ సందర్బంగా కళా పరిషత్ నిర్వాహకులు మాట్లాడుతూ… నాటక రంగానికి పునర్జీవం రావాలంటే, నాటకాలు ఆడడానికి ఆడిటోరియాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ పోటీలను పారదర్శకంగా నిర్వహించేందుకు, విజేతలకు అవార్డులు ఇచ్చేందుకు దానికి సంబందించిన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కళాకారులకు సౌకర్యాలు కల్పించింది. ఈ వేడుకలకు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, శాసనమండలి విప్ అప్పిరెడ్డి, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి, తదితరులు హాజరయ్యారు.
