గిరి ప్రదక్షణ కాలినడక భక్తుల సౌకర్యార్థం ప్రతి సంవత్సరంలలే ఈసారి కూడా లోక కళ్యాణార్ధం సేవను అందించామని ఏ.యూ. విద్యార్థి నాయకుడు సమయం హేమంత కుమార్ అన్నారు. ఈసారి దాతలు పెద్దిని అశోక్ కుమార్, లాడి మణికంఠ, పొట్నూరి సుమంతుల సహాయార్థం బాదంపాలు, గోధుమ నూక ప్రసాదం, సమోసాలు ,వివిధ రకాల పండ్లు ను 96 సంవత్సరాలు నిండిన ఏ.యూ. విశ్రాంతి ప్రొఫెసర్ చిలుకూరి శాంతమ్మ, తదితర నాయకుల చేతులు మీదగా ఏ.పీ. నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్, పొట్నూరి వెంకట కృష్ణారావు పంపిణీ చేయించారు .ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహేష్, పూడి తిరుపతిరావు, శ్రీ రామారావు, వాసుపల్లి రాంబాబు, సనపల తిరుపతిరావు, విజయ్, జింజలూరి గోవిందు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గిరి ప్రదక్షణ భక్తుల సౌకర్యార్థం దాహార్తిని తీర్చిన అన్నప్రసాద దాతలు…

