విజయవాడలో రాష్ట్ర జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (మైనింగ్) గోపాలకృష్ణ ద్వివేది హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఖనిజాన్వేషణ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందించనుందని అన్నారు. రాష్ట్రంలో అపారమైన ఖనిజ వనరులను గుర్తించడం కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వం టి సంస్థలు మరింత చురుగ్గా అన్వేషణలను కొనసాగించాలని కోరారు. విదేశ జీ.డీ.పీ. లో మైనింగ్ వాటాలతో పోలిస్తే మన రాష్ట్ర జీడీపీలో మాత్రం మైనింగ్ వాటా అధికంగా ఉండడం గర్వకారణమన్నారు. మేజర్ మినరల్ మైనింగ్ కోసం ఎక్స్పైరేషన్ ఏజెన్సీలు 56 బ్లాకులను రాష్ట్రానికి కేటాయించాయని తెలిపారు.

