వై.ఎస్.ఆర్ కడప జిల్లాలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల పర్యటనలో రెండవ రోజు ఆయన వై.ఎస్.ఆర్ ఘాట్ వద్ద తన కుటుంబ సభ్యులతో, ప్రజా ప్రతినిధులతో, అధికారులతో కలిసి వేంపల్లె లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో హాజరయ్యి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రజల అవసరాలు తీర్చే పథకాలతో ప్రభుత్వంపై వారు పెట్టుకున్న నమ్మకాన్ని రెట్టింపు చేసేలా కృషిచేస్తామని, అదేవిదంగా భవిష్యత్తులో కూడా అదే పాలనను కొనసాగిస్తామని అన్నారు. తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం రూ. 36.03 కోట్లతో సింహాద్రిపురంలో చేపట్టిన అభివృద్ధి వనులను ఆయన ప్రారంభించారు. పులివెందులలో అర్బన్ డవలప్మెంట్ ఆథారిటీ అభివృద్ధి పనులపై సంబందిత అధికారులతో, సమీక్షా సమావేశం నిర్వహించి సమాచారాలు తెలుసుకున్నారు.
క్రిస్మస్ వేడుకల్లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి…

