భారతీయ ధర్మం సనాతన ధర్మం, భారతీయ సాంప్రదాయం అతి పురాతనం అలాగే భారతదేశంలో కళలకు అనాదిగా ఆధరణ ఉంది. మన కళలు 64 వాటిలో లలిత కళలు, జానపద కళలు ప్రధానం. దాగి ఉన్న కళను బయటకు తీయడానికి “క్రియ” పిల్లల పండుగ పేరుతో ప్రభుత్వం గత శనివారం, ఆదివారం రోజుల్లో జే.ఎన్.టీ.యూ. కాకినాడలో అనేక పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో ఒకటి దాదాపు అంతరించిపోయిన మన ప్రాచీన జానపద కళ అయిన బుర్రకథను మన భాష్యం లో చదువుతున్న 5వ తరగతికి చెందిన ఎమ్. శ్రీలేఖ జీవదిని, డీ. తేజస్విని, జీ. వర్థిని ఆలపించారు. ఈ పోటీలో దాదాపు 60 పాఠశాలలు పాల్గొనగా ఈ విద్యార్థులకు రెండవ ర్యాంకు వచ్చినట్లుగా ప్రిన్సిపాల్ ఎమ్. సూర్యారావు, బీ. శిరీషలు తెలియజేశారు. పోటీలో గెలుపొందిన విద్యార్థులను భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ గారు, జోనల్ ఇన్చార్జి గోవిందరాజు గారు అభినందించారు.
“క్రియ“ పిల్లల పండుగలో భాష్యం విద్యార్థుల విజయ కేతనం…