కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనుకు బెయిల్ పట్ల ఆర్.పి.ఐ. (అంబెడ్కర్ ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు జాతీయ కార్యదర్శి డాక్టర్ పిట్టా వర ప్రసాద్ హర్షం వ్యక్తం చేసారు. జగన్ ను కోడి కత్తితో పొడిచినందుకు జైలు పాలయిన శ్రీను ఐదేళ్లుగా జైల్లోనే మగ్గుతున్నారు. ఇటీవల హైకోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని ఆయన తెలిపారు. అతని తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు, దళిత సంఘలు, రాజకీయ పార్టీలు సుదీర్ఘ పోరాటాల ఫలితంగా క్రింది కోర్టు లో 8 సార్లు బెయిల్ నిరకరించినా… 9వ సారి హై కోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేసారు. త్యరలోనే నిర్దోసిగా శ్రీను బయట పడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
కోడి కత్తి శ్రీనుకి బైల్ మంజూర్….

