కాకినాడ జిల్లాకు చెందిన కాజులూరు మండలం అయితపూడి గ్రామంలో కొల్లు వెంకన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా తొలత సంక్రాంతిని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాంగా మాజీ సర్పంచ్ కొల్లు వెంకటేశ్వరరావు, ఇతర కుటుంబసభ్యులు పరిసర గ్రామాలకు చెందిన సుమారు 500 మంది నిరుపేదలకు దుస్తులు, పండ్లు, మిటాయిలు వారి చేతుల మీదుగా పంపిణీ చేసారు.
మహిళలకు చీరలు, పురుషులకు దుప్పట్లు, లుంగీ, తువాళ్ళు అందజేశారు. దివంగత కొల్లు వెంకన్నగారి జ్ఞాపకార్థం కొల్లు వెంకన్న ఫౌండేషన్ పేరున ప్రతీ ఏడాది పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన మనవడు కొల్లు వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లు వరలక్ష్మి, రవితేజ, శృతి, చైతన్యకృష్ణ, మాణికుమారి, వేద, పంపన వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

