డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కొనసీమ జిల్లా అమలాపురం ఎండూరి కన్వెషనల్ హల్లో టీ.డీ.పీ., జనసేన, బీ.జే.పీ. కూటమి ఎం.పి. అభ్యర్థి హరీష్ మధుర్ మీడియా మిత్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహంచారు. ఈ సందర్బంగా జీ.ఎం.సీ. బాలయోగి కుమారుడు గంటి హరీష్ మధుర్ మీడియా తో మాట్లాడుతూ… గడిచిన ఈ ఐదు సంవత్సరలు నుండి అంబెడ్కర్ కొనసీమ జిల్లా అభివృద్ధి విషయం లో వెనకబడి ఉందన్నారు. అంతేకాకుండా కొనసీమ జిల్లా ప్రజలు ఆకాంక్ష రైల్వే అని ఆ రైల్వే ఇప్పడివరకు నత్త నడక నడుస్తుందని, ఇక్కడ ఉన్న ఎం.పి. కూడా ఏమి చెయ్యలేని పరిస్థితని ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఎక్కడ మాట్లాడలేని పరిస్థితి అంటూ మండిపడ్డారు. మేము ప్రతిపక్షంలో ఉన్న కూడా ఢిల్లీకి వెళ్లి ప్రశ్నించడం జరిగిందని అన్నారు.
కొనసీమ జిల్లా అభివృద్ధి విషయం లో వెనకబడింది… -ఎం.పి. అభ్యర్థి హరీష్-

