కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు మండలం కొడవలి బౌద్ధ క్షేత్రానికి సమీపంలో గ్రావెల్ తవ్వకాలను మధ్యంతర ఉత్తర్వులతో నిలుపుదల చేసిన హైకోర్టు విచారణ పట్ల పౌర సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. పురావస్తు శాఖ అనుమతి లేకుండా గ్రావెల్ తవ్వకాలను చేపట్టడం వలన చారిత్రక బౌద్ధ క్షేత్రానికి ముప్పు ఏర్పడటం జరిగిందన్నారు.
చారిత్రక ప్రదేశాలకు 200 మీటర్ల దూరం వరకు తవ్వకాలు చేయకూడదన్న నియమాలను కాదని అధికారులు అనుమతులు ఇవ్వడం దురదృష్టకరమన్నారు. ఈ అంశంపై సంఘం శరణం గచ్ఛామి అంటూ కొడవలి బుద్ధ మహా స్తూప పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షుడు అయితా బత్తుల రామేశ్వరరావు పిల్ దాఖలు చేసిన సందర్భంగా హైకోర్టు జోక్యం వహించడం అత్యంత శుభ పరిణామమని పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు.
