కాకినాడ నియోజకవర్గం ప్రజాప్రతినిధి ద్వారంపూడి చేస్తున్నా అవినీతి అక్రమాలను, దోపిడీలు దురాగతాలను ప్రశ్నిస్తే ఎదురు కేసులు పెట్టించడం పరిపాటిగా మారిందనీ ఈ విధంగా చేస్తే ప్రజలు భయపడి చేతులు ముడుచుకుని కూర్చుంటారు అనుకోవడం ద్వారంపూడి వివేకం అని కాకినాడ సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. స్థానిక సిద్ధార్థ నగర్ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న బియ్యం అక్రమ రవాణా ద్వారా 15 వేల కోట్ల రూపాయలు సంపాదించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
కేసులు పెట్టుకుంటే … పెట్టకో…!!!

