Viral

కేరళలో నాలుగు జిల్లాలకు ఐ.ఎం.డీ. రెడ్ అలర్ట్…

OIF (3)

కేరళా రాష్ట్రంలోని పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో మంగళవారం వరకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీనితో కేరళ అప్రమత్తమైంది. ఈ జిల్లాల్లో 204.4 మి.మీ కంటే ఎక్కువ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు తిరువనంతపురం, కొల్లం, ఎర్నాకులం జిల్లాల్లో బుధవారం వరకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో బుధవారం వరకు 115.6 నుంచి 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెళ్లడించింది. బుధవారం వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐ.ఎం.డీ. అంచనా వేసింది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.